కలం వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నేడు నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ-62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించింది. ఇస్రో చైర్మన్ వి.నారాయణ దీనికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. రాకెట్ ప్రయోగం మొత్తం ఐదు దశల్లో జరగాల్సి ఉండగా మొదటి మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. నాలుగో దశలో అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. ప్రయోగం మొత్తం 18 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా నాలుగో దశ ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు. ఈ సమస్యపై శాస్త్రవేత్తల బృందం విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


