Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త ఫ్లాట్ కొన్న శుభ్‌మన్ గిల్‌.. ఎంతో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: టీమిండియా టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) పంజాబ్‌లోని మొహాలీలో కొత్త ఫ్లాట్‌ కొన్నాడు. ఇందుకోసం రూ.3 కోట్లు వెచ్చించాడట. ఇది కేవలం ఫ్లాట్ మాత్రమే కాదని.. ఇంధ్ర భవనాన్ని తలపించే రీతిలో ఇంటీరియర్ డిజైన్ ఉందట. పంజాబీ మార్క్‌తో పాటు ఫారెన్ గ్రాండ్ లుక్ కూడా ఈ విల్లా సొంతం. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ భవంతిలో తన ట్రోఫీలు, అవార్డులు పెట్టుకునేందుకు పెద్ద గదిని కేటాయించుకోవడం గమనార్హం.

ముంబయిలోనూ ఖరీదైన ఫ్లాట్..

శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) గతంలోనూ ఇలాగే ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది సెలెబ్రిటీ అయ్యాడు. ముంబయిలోని ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ.20 కోట్ల ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇదే ప్రాంతంలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్‌కు సైతం ఫ్లాట్ కొన్నాడు. ఇవే గాకుండా, గిల్ తన ఆదాయంలో గరిష్ఠ భాగాన్ని స్థిరాస్తులపైనే వెచ్చిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>