Mobile Popup Ad
Mobile Popup Ad

కిన్నెరసాని వంతెన వద్ద ప్రమాదం.. యువకుడు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కిన్నెరసాని వంతెన వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ములకలపల్లి మండలానికి చెందిన మడకం కన్నారావు తన బైక్ పై వెళ్తుండ‌గా కిన్నెరసాని వంతెన సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కన్నారావు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న దంపతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>