అయ్యర్ అదుర్స్.. ఢిల్లీ టార్గెట్ 211

క‌లం, వెబ్‌డెస్క్‌: ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బ్యాటర్లు అదరగొట్టారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌ను జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరిలో స్టోనిస్, శశాంక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన సూర్యాంష్ హెగ్దే మాత్రం చెలరేగాడు. అంతకుముందు బంతికే వికెట్ పడినా.. తనకు అదేం పట్టదన్నట్లు తరువాతి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా, యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విరుచుకుపడి ఢిల్లీ బౌలర్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. 211 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీకి పంజాబ్ బౌలర్లను ఎదుర్కోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టులో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18) త్వరగానే అవుటైనా, ప్రియాన్ష్ ఆర్య గ్రౌండ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లతో 56 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్) తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో కూపర్ కానోలీ (38) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు దిశగా సాగింది.

చివర్లో మార్కస్ స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0) వరుస బంతుల్లో అవుట్ కావడంతో పంజాబ్ కాస్త తడబడినట్లు అనిపించింది. కానీ సూర్యాన్ష్ షెడ్జ్ కేవలం 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు పిండుకుని స్కోరును 210 వద్ద నిలిపాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు. మాధవ్ తివారీకి 2, ముకేశ్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. లుంగీ ఎన్గిడి 46 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>