మంత్రి పొన్నం అసహనం.. అధికారులకు కలెక్టర్ షోకాజ్‌ నోటీసులు

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకాని అధికారులపై కలెక్టర్ హైమావతి సీరియస్ గా ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, వేడుకలకు హాజరుకాని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకాని మరో 15 మంది జిల్లా అధికారులు, 150 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అధికారులు, ఉద్యోగులు హాజరు కాకపోవడంతో రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినవి. ఉద్యోగుల తీరుపై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకాని అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్ హైమావతి, నోటీసులు జారీ చేశారు.

Read Also: నార్వే చెస్ 2026 ఛాంపియన్ ప్రజ్ఞానంద..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>