కలం, వెబ్ డెస్క్: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) భారీ ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకల కోసం ఆయన కరీంనగర్‌లోని కెమిస్ట్ భవన్‌కి వెళ్లారు. తిరిగి కిందకు లిఫ్ట్‌లో వస్తుండగా రెండో అంతస్తు నుంచి తెగిపోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్‌లో కవ్వంపల్లి, ఆరేపల్లి మోహన్‌తో పాటు మరో ఆరుగురు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో భద్రతా సిబ్బంది, ఎమ్మెల్యే అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: నాకున్న పెద్ద సమస్య అదే: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Youtube

