Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌గిత్యాల ప్రేమ జంట అదృశ్యంలో షాకింగ్ ఘ‌ట‌న‌!

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో ప్రేమ జంట అదృశ్యంలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇప్ప‌టికే కాలువ‌లో ప్రియుడి మృత‌దేహం ల‌భించ‌గా.. తాజాగా ప్రియురాలు కూడా కాలువ‌లో శ‌వ‌మై తేలింది. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యం కాగా ఇద్దరి మృతదేహాలు ఎస్సారెస్పీ కెనాల్‌లో లభించడం కలకలం సృష్టిస్తోంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్రకు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్‌తో సహా ఇద్దరు కెనాల్‌ పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రేమ జంట మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>