కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ సలహాదారుడిగా (SSA) మాజీ డీజీపీ శివధర్ రెడ్డి (Shivdhar Reddy)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయనకు పదవి కేటాయించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. డీజీపీగా విధులు నిర్వహించిన శివధర్ రెడ్డి స్థానంలో నూతన పోలీస్ బాస్ గా సీవీ.ఆనంద్ ను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. శివధర్ రెడ్డి పదవి కాలం ముగియడంతో ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకునేందుకు స్టేట్ సెక్యూరిటీ సలహాదారుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, ఆయన నియామకంపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

