పోస్టుకార్డులతో సీఎంకు NHM ఉద్యోగుల వినూత్న నిరసన

కలం, నిర్మల్: ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను, పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>