Mobile Popup Ad
Mobile Popup Ad

బాలయ్య తొడగొడితే సైకో బ్యాచ్ ఖతం.. లోకేశ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో (Mangalagiri) టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ముగింపు కార్యక్రమం జరిగింది. నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘బాలయ్య బాబు ఒక్కసారి తొడగొడితే ఈ సైకో బ్యాచ్ బతకదు’ అని హెచ్చరించారు. ప్రత్యర్థుల రాజకీయాలకు ‘పసుపు సైన్యం’ త్వరలోనే ఎండ్ కార్డ్ వేస్తుందని హెచ్చరించారు. నందమూరి బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన మీ అందరికీ బాలయ్య కావచ్చు.. కానీ నా ఒక్కడికే ముద్దుల మావయ్య అంటూ ఆత్మీయతను చాటుకున్నారు.

తమకు గల్లీ రాజకీయాలతోపాటు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు అని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా వెనకడుగు వేయని కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని అన్నారు. ‘మేం ఓడినప్పుడు వెనక్కి తగ్గలేదు.. గెలిచామని కాలర్ ఎగరేయడం లేదు’ అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>