శివకుమార్ కుటుంబానికి అండగా ఉంటాం.. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన శివకుమార్ కుటుంబాన్ని సోమవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA)  ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివకుమార్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>