మక్తల్‌–వానాయికుంట రహదారి నిర్మాణంపై మంత్రి వాకిటి కీలక హామీ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. శనివారం మక్తల్ (Makthal) పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని, మక్తల్‌ నుంచి వానాయికుంట వరకు రహదారి నిర్మాణం చేపట్టి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

మక్తల్ పట్టణంలోని 7వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. అదే సమయంలో ఆటోలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను గమనించి వారితో కొద్ది సేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారి చదువులు, పాఠశాలకు వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీ ఊరికి అవసరమైన అన్ని మౌళిక వసతులు కల్పించే బాధ్యత తనదని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

మక్తల్‌ నుంచి వానాయికుంట వరకు రోడ్డు వేయిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల పట్ల మంత్రి చూపిన ఆప్యాయత, గ్రామ అభివృద్ధిపై ఇచ్చిన హామీ విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించింది. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మానస, వైస్ ఛైర్మన్ విద్యా నిరంజన్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>