ఢిల్లీలో తీవ్ర అగ్నిప్రమాదం.. కార్ షోరూమ్‌లో చెలరేగిన మంటలు!

కలం, వెబ్ డెస్క్ : దక్షిణ ఢిల్లీలోని (South Delhi Fire) ఎంజీ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ కార్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు షోరూమ్ అంతటా వేగంగా వ్యాపించడంతో అక్కడ దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగులు, వినియోగదారులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.

ఈ సమయంలో స్థానిక యువకులు ఎంతో ధైర్యంతో స్పందించి, పైకప్పుపై చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించేందుకు రెస్క్యూ చర్యల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంటల్లో చిక్కుకున్న వారిని భవనం పైకప్పు నుంచి సురక్షితంగా కాపాడారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 13 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలవ్వగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో షోరూమ్‌లో ఉన్న దాదాపు 6 నుండి 7 కొత్త కార్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>