తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా శివ ప్ర‌తాప్ శుక్లా!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ జిష్ణుదేవ్ వ‌ర్మ మ‌హారాష్ట్రకు బ‌దిలీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla)ను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ అనంద బోస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాలు చేప‌ట్టారు.

ప్రధాన నియామకాలు ఇవే….

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. నంద్ కిశోర్ యాదవ్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసనైన్‌ను బీహార్ గవర్నర్‌గా నియమించారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహించేందుకు నియ‌మించారు.

ఈ మార్పులు వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమలవుతాయి. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణ‌యంపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి తనతో సంప్రదించకుండా రవిని నియమించడం సాంప్రదాయానికి విరుద్ధమన్నారు. ఈ గవర్నర్ల మార్పులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: నాలుగేళ్ల మ‌నోవేద‌న స్వామి ద‌య‌తో తీరిపోయింది: కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>