epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్​ లో ఉండడం హసీనా సొంత నిర్ణయం: జైశంకర్​

కలం, వెబ్​ డెస్క్​: బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని షేక్​ హసీనా (Sheikh Hasina) తన సొంత నిర్ణయంతోనే భారత్​ లో ఉంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar)​ అన్నారు. హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్​ నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఒత్తిడుల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బంగ్లాదేశ్​ లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం హసీనా భారత్​ కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్​ లోని తాత్కాలిక ప్రభుత్వం.. హసీనాపై అనేక కేసులు నమోదు చేసింది. బంగ్లాలో వందల మందిని బలి తీసుకున్న అల్లర్ల వెనక హసీనా హస్తముందంటూ విచారణ జరిపింది. ఇటీవల ఆమెకు మరణశిక్ష సైతం విధించింది. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ భారత్​ ను కోరుతోంది. దీనిపై శనివారం విలేకరులతో జై శంకర్​ (Jaishankar) మాట్లాడుతూ.. భారత్​ కు రావాలన్నది పూర్తిగా హసీనా సొంత నిర్ణయమన్నారు. బంగ్లాదేశ్​ తిరిగి వెళ్లాలా లేదా అనేది అక్కడి పరిస్థితులను బట్టి ఆమె నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య, పొరుగు దేశంగా భారత్​ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్​ శ్రేయస్సును కోరుకునే దేశమని జైశంకర్​ స్పష్టం చేశారు.

Read Also: గెలుపు కోసం తాంత్రిక పూజలు.. ‘స్థానిక‘ పోరులో చిత్ర విచిత్రాలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>