రహానే ఔట్.. శివమెత్తుతున్న శార్దూల్

కలం, వెబ్ డెస్క్: వాంఖడే స్టేడియంలో ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) శివమెత్తుతున్నాడు. ఇప్పటి వరకు కేకేఆర్‌వి మూడు వికెట్లు పడితే.. మూడిటిని తీసింది శార్దూల్ ఠాకూరే కావడం విశేషం. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు చెక్ పెడుతూ, వరుస వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను రేసులోకి తీసుకొచ్చారు. రహానే ఔట్ కావడంతో కేకేఆర్ భారీ స్కోరు ఆశలపై శార్దూల్ నీళ్లు చల్లారు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న పోరులో శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగుతున్నాడు. కేకేఆర్ టాప్ ఆర్డర్‌ను ముప్పతిప్పలు పెడుతున్న శార్దూల్, ఇప్పటికే ఫిన్ అలెన్, కేమెరాన్ గ్రీన్ వికెట్లు తీసి జోరు మీదున్నారు. తాజాగా సెంచరీ దిశగా దూసుకుపోతున్న కెప్టెన్ రహానేను కూడా తన బుట్టలో వేసుకున్నారు.

శార్దూల్ వేసిన క్రాస్-సీమ్ ఫుల్ డెలివరీని భారీ షాట్ ఆడబోయిన రహానే, టైమింగ్ కుదరక కవర్స్‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 67 పరుగులు చేసి టీమ్ కోసం ఒక పటిష్టమైన పునాది వేశారు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన ప్రతి ఓవర్ ఒక మలుపుగా మారింది. కేవలం 2.5 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (3 ఓవర్లలో 28), మయాంక్ మార్కండే (1 ఓవర్‌లో 16) పరుగులు సమర్పించుకున్న చోట, శార్దూల్ తన పొదుపైన బౌలింగ్‌తో కేకేఆర్ రన్ రేట్‌కు కళ్లెం వేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>