Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిలో ప్రమాదం.. డంపర్ పేలి ఒకరు మృతి, నలుగురికి గాయాలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru)లో సింగరేణి ఓసీ- 2 గనిలో ప్రమాదం జరిగింది. వీపీఆర్ కంపెనీకి చెందిన ఓబీ పనుల్లో భాగంగా నిలిపి ఉంచిన డంపర్ వాహనం టైర్ పేలడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఉదయం షిఫ్ట్‌లో టైర్ సమస్య తలెత్తడంతో డంపర్‌ (Dumper)ను నిలిపివేశారు. అనంతరం బ్రేక్‌డౌన్ అయిన డంపర్‌ను రిపేర్ చేస్తుండగా, అకస్మాత్తుగా టైర్ బ్లాస్ట్ అయ్యింది.

ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులంతా బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>