Mobile Popup Ad
Mobile Popup Ad

ఘ‌నంగా యూట్యూబ‌ర్ షణ్ముఖ్​ జ‌శ్వంత్ వివాహం!

క‌లం, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ షణ్ముఖ్​ జ‌శ్వంత్ (Shanmukh Jaswanth) వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తాను కొంత కాలంగా ప్రేమిస్తున్న అమ్మాయి వైష్ణవి చోడిశెట్టిని షణ్ముఖ్​ వివాహం చేసుకున్నాడు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు అతి కొద్దిమంది స్నేహితులు, బంధువుల మ‌ధ్య వీరి వివాహం జ‌రిగింది. సాఫ్ట్‌వేర్ డెవెల‌ప‌ర్‌, సూర్య వంటి వెబ్ స‌రీస్‌తో ష‌ణ్ముఖ్ మంచి గుర్తింపు సాధించాడు. ఆ త‌ర్వాత ఐదో సీజ‌న్‌లో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు.

దీంతో పాటు ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ దీప్తి సునైనా ప్రేమ వ్య‌వ‌హారంతో కూడా షణ్ముఖ్​ చాలా ఫేమ‌స్ అయ్యాడు. అయితే దీప్తి కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కార‌ణంగానే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లుస్తార‌ని వీరి ఫ్యాన్స్‌ భావించినా అది జ‌ర‌గ‌లేదు. దీప్తితో విడిపోయిన త‌ర్వాత షణ్ముఖ్​ వైష్ణ‌వితో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఫిబ్ర‌వ‌రి 25న వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఇక ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>