Mobile Popup Ad
Mobile Popup Ad

‘కేటీఆర్ కు ఎప్పుడూ ఆ ధ్యాసే’.. మంత్రి సీతక్క విమర్శలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం సినిమా అట్టర్ ప్లాప్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Seethakka) కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఎంపీడీవో నూతన భవనాన్ని నేడు ప్రారంభించిన అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క స్పందించారు. కేటీఆర్ కు ఎప్పుడూ సినిమా ధ్యాసేనని విమర్శించారు. ప్రజాపాలనను సినిమాతో పోల్చడమే ఆయన ఆలోచనకు నిదర్శమని ఆరోపించారు.

కేటీఆర్ ఆలోచనలు అమలు కాకపోతే మా పాలన విఫలమైనట్టా? అని సీతక్క ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ దిట్ట అని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేయడం మానేసి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>