కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC Driver Shankar Goud) మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో చర్చలు జరుపుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. కార్మికులు ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదని సూచించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కార్మికులను రెచ్చగొడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడొద్దని సూచించారు. కార్మికులు ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also: సంచలనం.. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఇదే ?
Follow Us On: X(Twitter)

