కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) గత కొంతకాలంగా కండరాల గాయాలతో సతమవుతున్నారు. భుజాల
రొటేటర్ కఫ్ గాయం, కండరాలు చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఇటీవల క్యాబినెట్ భేటీలో కూడా హఠాత్తుగా వెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి ముంబైకి వెళ్లారు. అక్కడ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోనున్నారు.
అక్కడ వైద్య పరీక్షల అనంతరం పవన్ కళ్యాణ్ కు సర్జరీ అవసరమా? లేదా? అన్న విషయాలను వైద్యులు నిర్దారించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయన ఆసుపత్రిలో చేరే అంశంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు పార్టీని చూసుకుంటూ, మరోవైపు అధికారులతో సమీక్షలు, పర్యటనలు చేస్తూ తన ఆరోగ్యాన్ని పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేశారు. దీంతో పాటు గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సి రావడంతో ఒత్తిడి పెరిగి ఆయన రెండు భుజాల కండరాలు చిట్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం కూడా అయిందని సమాచారం అందుతోంది.

