Mobile Popup Ad
Mobile Popup Ad

తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం.. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహం

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. శంకర్‌గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట (Narsampet) డిపోకు తీసుకెళ్లాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టారు. పోలీసులు అంగీకరించకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సంపేటకు తరలించాల్సిందేనని పట్టుబట్టారు. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్టీసీ సంఘాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒత్తిడితో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో 22 ఏళ్లపాటు సేవలందించారు. శంకర్ గౌడ్‌ను కడసారి చూసుకుని నివాళులు అర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు వేచి చూస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శంకర్ గౌడ్ ను కడసారి చూసేందుకు కార్మికులు భారీసంఖ్యలో తరలివస్తున్నారు.

Read Also: ఒక్కడే దిక్కయితే ఎలా?.. చెన్నైకి సెహ్వాగ్ వార్నింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>