Mobile Popup Ad
Mobile Popup Ad

శంక‌ర్ గౌడ్‌ది ముమ్మాటికీ రేవంత్ స‌ర్కార్ హ‌త్యే: ఎర్ర‌బెల్లి

కలం, వరంగల్ బ్యూరో: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao)ను సుబేదారీ పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేటలో ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసిన ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ (RTC Driver Shankar Goud) నేడు తెల్ల‌వారు జామున మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న భౌతిక కాయాన్ని ముత్తోజీపేట‌కు తీసుకొచ్చిన నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి నివాళి అర్పించేందుకు హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసం నుంచి బ‌య‌లుదేరారు. దీంతో ఏసీపీ నరంహారావు, సీఐలు రంజిత్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, ఎస్సై మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చి ఎర్ర‌బెల్లిని నిర్భందించారు. ప్రశాంత్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వర్ధన్నపేట నాయకులు చింతల యాదగిరి, మార్గం బిక్షపతి, రాజు,యాకాంతం, జాక్కు రమేష్ గౌడ్ ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (Errabelli Dayakar) ఆయ‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యేన‌ని ఆరోపించారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాల‌నుకుంటే హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ కార్మికులను నమ్మించి దగా చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ హత్యేన‌ని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకెత కాలం గడుపుతార‌ని ప్ర‌శ్నించారు. ప్రజలే తరిమి తరిమి కొట్టేదాకా చూసుకోవద్దంటూ ఎర్ర‌బెల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also: సంచలనం.. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఇదే ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>