కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ 2026లో (T20 World Cup) భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తూ పాక్ తీసుకున్న నిర్ణయంపై భారత బాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆదివారం పాకిస్థాన్ బోర్డు భారత్ మ్యాచ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో గవాస్కర్ స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో ఇలాంటి నిర్ణయాలు మారడం అసాధారణం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఆటగాళ్లు పలుమార్లు రిటైర్మెంట్ ప్రకటించి కొద్ది రోజుల్లోనే వెనక్కి తీసుకున్న ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో భారత్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని కూడా బోర్డు మార్చుకునే అవకాశం ఉందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా స్పందనలు రావడం, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశ్నించడం మొదలైతే రెండు నుంచి నాలుగు రోజుల్లో నిర్ణయం మారవచ్చని గవాస్కర్ (Sunil Gavaskar) తెలిపారు. అభిమానుల ఒత్తిడి కూడా దీనికి కారణమవుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ పరిణామంపై ఐసీసీ (ICC) తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని సమాచారం. పాకిస్థాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరిపై ఇతర సభ్య బోర్డులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం కొనసాగితే పాకిస్థాన్‌పై సస్పెన్షన్ వంటి చర్యలు వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఈ అంశంపై పాకిస్థాన్ బోర్డు తదుపరి నిర్ణయం ఏమిటన్నది రానున్న రోజుల్లో స్పష్టతకు రానుంది.
Read Also: జూడ్‌కు గాయం.. రియల్ మ్యాడ్రిడ్‌కు భారీ ఎదురుదెబ్బ..
Follow Us On: Instagram


