epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షాహీన్ అఫ్రిది బౌలింగ్ రద్దు

కలం డెస్క్: పాకిస్థాన్ ప్రీమియం పేసర్‌గా గుర్తింపు పొందిన షాహీన్ షా అఫ్రిది(Shaheen Afridi)కి ఘోర అవమానం జరిగింది. బిగ్ బ్యాష్ లీగ్‌(Big Bash League)లో అతడి బౌలింగ్‌ను అంపైర్ రద్దు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా వరుసగా బీమర్స్ వేయడంతో ఫీల్డ్ అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మ్యాచ్ మొత్తం మళ్ళీ అఫ్రిది బౌలింగ్ వేయకుండా సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా షాహీన్‌కు బిగ్‌బాష్ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం కీలకంగా మారింది.

బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడుతున్న షాహీన్ షా అఫ్రిది, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌(Melbourne Renegades)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ వివాదానికి కేంద్రంగా నిలిచాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ బౌలింగ్ చేసిన షాహీన్, ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేయడంతో అంపైర్ల కఠిన చర్యలకు గురయ్యాడు. ఓవర్ మూడో బంతి హై ఫుల్‌టాస్‌గా బ్యాటర్ హెల్మెట్‌కు తాకడంతో అంపైర్ నోబాల్ ప్రకటించి తొలి బీమర్‌గా హెచ్చరిక ఇచ్చాడు. అనంతరం నాలుగో బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఫుల్‌టాస్‌గా వేయగా దాన్ని వైడ్‌గా ప్రకటించారు. అయినా మారని షాహీన్(Shaheen Afridi), ఐదో బంతిని మరోసారి బీమర్‌గా సంధించడంతో అంపైర్ నోబాల్ ఇచ్చి, వెంటనే అతన్ని బౌలింగ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేస్తే, ఆ బౌలర్‌ను ఆ మ్యాచ్ మొత్తం మళ్లీ బౌలింగ్ చేయకుండా నిషేధిస్తారు. అదే నిబంధన షాహీన్ అఫ్రిది విషయంలోనూ అమలైంది. అతని ఓవర్‌ను మెక్‌స్వీనీ పూర్తి చేశాడు. మ్యాచ్ రిఫరీలు ఈ ఘటనపై మరింత కఠినంగా స్పందించే అవకాశముండగా, షాహీన్ మ్యాచ్ ఫీజులో కోత విధించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

Read Also: ఐపీఎల్ వేలంలో కొత్త రూల్.. ఫ్యాన్స్‌లో నయా జోష్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>