కలం, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌లోని రియో గ్రాండే డోసుల్ రాష్ట్రాన్ని తుఫాను (Brazil Storms) అతలాకుతలం చేసింది. గ్వాయిబా నగరంలో ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్ హవాన్ ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిమ (Statue Of Liberty) కూలిపోయింది. తుఫాన్ వల్ల వీచిన బలమైన గాలుల కారణంగా 79 అడుగుల విగ్రహం నేలకొరిగింది. ఈ ఘటనకు సంబంధించి కొందరు వీడియో తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ గా మారాయి.
అయితే, హవాన్ స్టోర్ (Hawan Store) చైన్ తమ బ్రాండ్ కు గర్తుగా ప్రతి స్టోర్ ముందు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని (Statue Of Liberty) ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రియో గ్రాండే డోసుల్ (Rio Grande Dosulo) లో ప్రతిమను పెట్టాగా, తుఫాన్ భీభత్సంతో అది కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా, తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: షాహీన్ అఫ్రిది బౌలింగ్ రద్దు
Follow Us On: Sharechat


