బాలీవుడ్ హిట్ పెయిర్ అనగానే చాలామందికి షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), కాజోల్(Kajol) జంట గుర్తుకొస్తోంది. వెండితెర భగ్నప్రేమికులుగా ఈ జంట ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతో హై లాంటి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. అందుకే ఈ సినిమాలకు ఇప్పటికే క్రేజ్. ఇద్దరి మంచి కెమిస్రీతో పాటు సహజ నటన తోడు కావడం ఈ జంటకు హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఎన్నో రికార్డులును కొల్లగొట్టిన ఈ జంటకు మరోసారి అరుదైన ఘనత దక్కింది.
షాహ్ రుఖ్ ఖాన్(Shah Rukh Khan), కాజోల్ కాంబోలో 1995లో విడుదలైన ఐకానిక్ సినిమా దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ)లోని రాజ్, సిమ్రాన్ పాత్రల బ్రోంజ్ విగ్రహాం లండన్‌లో ఆవిష్కరణ జరిగింది. సినిమాలోని ఐకానిక్ పోజ్‌తో కూడిన విగ్రహాన్ని ఈ జంట ఆవిష్కరించింది. ఈ సినిమా 30వ వార్షికోత్సవ సందర్భంగా కాంస్య విగ్రహం ఏర్పాటు కాబోతోంది. హ్యారీ పోటర్, మేరీ పోపిన్స్, పాడింగ్టన్ లాంటి దిగ్గజాల సరసన వీరి విగ్రహం ఉండబోతోంది.
అదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. రొమాన్స్, చక్కని కుటుంబ విలువలు, అనుబంధ అప్యాయతాలు లాంటి సున్నితమైన భావోద్వేగాలతో భారతీయ సినిమా రంగంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 30 సంవత్సరాల తర్వాత కూడా ముంబైలోని మారాఠా మందిర్ థియేటర్‌లో ప్రతి రోజూ ప్రదర్శించబడిన సినిమా ఇదే కావడం విశేషం.
Read Also: శ్రీతేజను పూర్తిస్థాయిలో ఆదుకుంటాం: దిల్ రాజు
Follow Us On: Pinterest


