కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో కలకలం రేపిన ఆరు హత్యల కేసు (Shabad Murder Case) ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న నిందితుడి సోదరుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతూనే, తీవ్ర ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన తమ్ముడు చేసిన ఘోరానికి అతడికి ఇంత సులభంగా చావు రాకూడదని, అంతకంటే దారుణమైన శిక్ష పడాల్సిందంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
నిందితుడి మృతదేహం లభ్యమైన చోట అతడి సోదరుడు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “వాడికి చాలా ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఇచ్చారు.. అలా కాకుండా వాడిని కాల్చి చంపేసేది ఉండే” అన్నాడు. ఆ దారుణానికి ఒడిగట్టకుండా ఉండి ఉంటే, కనీసం ఆ పిల్లలనైనా తానే పెంచుకునేవాడినని, వాడు అందరి జీవితాలను నడిరోడ్డుపైకి తెచ్చాడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
Read Also: కాళేశ్వరంపై ఏడుపు.. పోలవరం ముంపును కప్పిపుచ్చేందుకే: పువ్వాడ
Follow Us On: Instagram

