మహిళా రక్షణ చట్టాల అమలుకు ఎస్ఎఫ్ఐ డిమాండ్

కలం, కరీంనగర్ : మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ యు. మానస డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా గర్ల్స్ కమిటీ సమావేశం సంజన అధ్యక్షతన మంకమ్మతోటలోని (Mankammathota) ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ.. రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్యార్థినులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. నిర్భయ చట్టం, అభయ చట్టం వంటి మహిళా రక్షణ చట్టాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

చట్టాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులపై వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కళాశాలల పరిసరాల్లో విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్స్‌ను అందుబాటులో ఉంచాలని, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృప, అశ్విని, సిరివెన్నెల, అమూల్య, సాత్విక, సుస్మిత, మధులత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>