ఐపీఎల్ మినీ వేలం.. కీల‌క అప్‌డేట్‌!

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ( IPL 2027 Auction) సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. ఆటగాళ్ల రీటైన్‌మెంట్, రిలీజ్ జాబితాను సమర్పించే గడువును బీసీసీఐ రెండు రోజులు పొడిగించి నవంబర్ 17కు మార్చింది. తొలుత భారత, న్యూజిలాండ్ జట్ల ఐదో వన్డేతో కలిసి నవంబర్ 15గా ఈ తేదీ ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మరోవైపు, తదుపరి మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీలకు పెద్ద షాక్ తగిలింది.

కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు తమను జట్టులోనే ఉంచుకోవాలంటే రీటైన్‌మెంట్ ఫీజుగా రూ. 40 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఇస్తేనే ఫ్రాంచైజీల్లో కొనసాగుతామని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు రూ. 40 కోట్ల డిమాండ్ రావడం లీగ్ చరిత్రలోనే సరికొత్త చర్చకు దారితీసింది.

రాబోయే మెగా వేలానికి జట్ల పర్స్ పరిమితి రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్లకు పెరిగే అవకాశం ఉండటంతో మరింత మంది ఆటగాళ్లు ఈ బాట పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వేలానికి ముందే రెండు ప్రధాన ట్రేడింగ్‌లు జరిగాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను లక్నో నుంచి తిరిగి దక్కించుకోగా, కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లాడు.

అలాగే ఢిల్లీ వేగవంతమైన బౌలర్ టి. నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇచ్చి, స్పినర్ జీషాన్ అన్సారీని తీసుకుంది. ఫ్రాంచైజీలు తమ జాబితాలను సమర్పించిన తర్వాత లీగ్ అధికారులు ఆటగాళ్ల తుది జాబితాను జట్లకు పంపుతారు. వేలానికి సరిగ్గా వారం ముందు ఈ జాబితాతో పాటు షార్ట్‌లిస్ట్ వివరాలను ఖరారు చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>