పెట్రోల్​ కొరత.. హైదరాబాద్​ బంకుల్లో నో స్టాక్​ బోర్డులు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించడం లేదు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్​ లోనూ ఇదే పరిస్థితి ఉంది. పెట్రోల్​ లేకపోవడంతో చాలా బంకుల్లో నోస్టాక్ బోర్డులు (No Stock Boards) దర్శనమిస్తున్నాయి. అలాగే బంకుల్లో ఇంధనం లేకపోవడంతో క్లోజ్​ అవుతున్నాయి. పెట్రోల్ కొరత (Petrol Crisis) తో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంకులు ఎక్కడ ఓపెన్​ ఉన్నాయో తెలుసుకుని బైకర్స్​, వాహనాల యజమానులు పోటెత్తుతున్నారు. దీంతో బంకుల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పడడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

మరోవైపు నగరంలో పెట్రోల్​ కొరత (Petrol Crisis) లేదు అని సీపీ సజ్జనార్​ ప్రకటించినప్పటికీ.. పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పుకార్లను నమ్మొద్దని ఆయన సూచించినా జనాలు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి అధికారుల ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేని పరిస్థితులు హైదరాబాద్​ లో కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్​ కంపెనీలకు డీలర్లకు మధ్య నెలకొన్న బకాయిల కారణంగా పెట్రోల్​ నిల్వ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్​ బంకుల నిర్వాహకులపై సివిల్​ సప్లై అధికారులు సీరియస్​ అవుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి ఇంధనాన్ని తెప్పించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>