Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీకి బాలీవుడ్ కళ.. చంద్రబాబుతో బాలీవుడ్ మున్నాభాయ్ భేటీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ (Film Industry) అభివృద్ధి, సినిమా షూటింగ్‌లు, ఫిలిం ప్రొడక్షన్ అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు, ప్రకృతి సౌందర్యం దృష్ట్యా షూటింగ్‌లకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని, ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు సంజయ్ దత్‌కు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సినీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫిలిం ప్రొడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>