Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో మార్చాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

కలం, వరంగల్ బ్యూరో : జిల్లాలో భూసేకరణ చట్టం కింద సేకరించిన ప్రతి భూమి వివరాలు రెవెన్యూ రికార్డులలో మార్చాలని హనుమకొండ (Hanamkonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ (Hanamkonda) కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతిపై అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీవోలు, తహసీల్దార్లతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ చేశామని తెలిపారు.

అందులో ఇంకా చాలా భూములు రెవెన్యూ రికార్డుల్లో పాత పట్టాదారుల పేరున ఉన్నాయని.. వాటిని రెవెన్యూ రికార్డులలో సంబంధిత ప్రాజెక్టుల పేరున ప్రభుత్వ భూమిగా మార్చాలన్నారు. వీటిపై ప్రతి వారం అధికారులతో సమీక్ష ఉంటుందని.. ప్రగతి నివేదికలను సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తహసీల్దార్లు జ్యోతి వరలక్ష్మి దేవి, ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, నాయబ్ తహసీల్దార్లు సంతోష్ కుమార్, శ్యామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>