Mobile Popup Ad
Mobile Popup Ad

బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం (Bayyaram) క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో కారు, బైకు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉప్పక గ్రామానికి చెందిన తరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>