కలం, స్పోర్ట్స్: ఢిల్లీతో (Delhi Capitals) పోరులో లక్నో సూపర్ జాయింట్స్ చతికిలబడింది. ఢిల్లీ బౌలర్ల పదునైన పంజాకు లక్నో సూపర్ జాయింట్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. బ్యాటర్లందరూ పెవిలియన్‌కు క్యూ కట్టింది. లక్నో తన హోం గ్రౌండ్‌లో కూడా కనీసం ప్రదర్శన చూపకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన 141 పరుగులకే 10 వికెట్లు సమర్పించుకుంది. మొత్తం లక్నో జట్టులో మిఛెల్ మార్ష్ , అబ్దుల్ సమద్ పర్వాలేదనిపించారు. మార్ష్ 28 బంతుల్లో 35 పరగులు చేస్తే, సమద్ 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అయిన రిషబ్ పంత్ దురదృష్టవశాత్తు 7 పరుగులకే రన్‌ఔట్ అయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ( Lucknow Super Giants) ఆరంభం నుండే చుక్కెదురైంది. రిషబ్ పంత్ (7) రనౌట్ రూపంలో వెనుదిరగగా, ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) కాసేపు పోరాడినా, మిగిలిన వారంతా ‘వచ్చిన దారినే’ పెవిలియన్‌కు చేరారు. ముఖ్యంగా ఆయుష్ బదోని, అన్రిచ్ నోర్ట్జే, మొహ్సిన్ ఖాన్‌లు సున్నాలకే పరిమితమై లక్నో స్కోరు బోర్డును దెబ్బతీశారు.
ఢిల్లీ బౌలర్లలో నటరాజన్, లుంగీ ఎన్గిడి చెరో 3 వికెట్లతో చెలరేగగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో లక్నో నడ్డి విరిచారు. దీంతో 18.4 ఓవర్లలోనే 141 పరుగులకు లక్నో ఆలౌట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఇప్పుడు 142 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. మరి ఈ టార్గెట్‌ను ఢిల్లీ ఎలా ఛేదిస్తుందో చూడాలి.

