కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులు సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరణవార్త తెలుసుకున్న పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని జర్నలిస్టులు పేర్కొన్నారు. శ్రీనివాసులు మృతదేహానికి పలువురు జర్నలిస్టులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిటి అశోక్ కుమార్, కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి, జిల్లెల రఘు, రామకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, కేశవులు, ప్యాట వెంకటయ్య, బీజీ రామాంజనేయులు, నిరంజన్ పాల్గొన్నారు.

