కలం, ఉట్నూర్: ఉట్నూర్‌లోని(Utnoor) తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గిరిజన గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికల బహుమతి ప్రదానోత్సవంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bhojju Patel) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

