రూ.46 కోట్ల మోసం.. పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

కలం, వెబ్ డెస్క్ : సీనియర్ సినీ నటి రాధ (Actress Radha) చెన్నై పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి వివాదంలో తన అక్క, ప్రముఖ నటి అంబికతో పాటు సోదరుడు మల్లికార్జున్‌పై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన వ్యాపార అవసరాల కోసం ముందే సంతకాలు చేసి ఉంచిన రూ.46 కోట్ల విలువైన చెక్కులను దొంగిలించి, నగదు విత్ డ్రా చేసుకునేందుకు యత్నించారని రాధ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దొంగిలించిన చెక్కులు.. వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం తాను ముందే సంతకం చేసి భద్రపరిచిన ఖాళీ చెక్కులను అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్ దొంగతనం చేశారని ఆమె (Actress Radha) ఆరోపించారు. తన ప్రమేయం లేకుండానే 46 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకునేందుకు కుట్ర పన్నారన్నారు.

తనను మోసం చేసి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన అంబిక, మల్లికార్జున్ లపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాని పోలీసులను రాధ కోరారు. చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన అక్కాచెల్లెళ్ల మధ్య ఈ స్థాయిలో ఆర్థిక వివాదం తలెత్తడం తమిళంతో పాటు తెలుగు సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాధ ఫిర్యాదు ఆధారంగా చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>