నిర్మల్ జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: బీఆర్‌ఎస్‌వీ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాకు ప్రత్యేకంగా యూనివర్సిటీ (Nirmal University) ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌వీ (BRSV) జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మిర్జా షోయేబ్ మాట్లాడుతూ.. జిల్లాలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో వారి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. నిర్మల్ జిల్లాలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు డిగ్రీ, పీజీతో పాటు ఇతర ఉన్నత విద్యా కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను స్థానికంగానే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత జనవరి 16న నిర్మల్‌లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మల్ జిల్లా విద్యార్థులకు త్వరగా ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని మిర్జా షోయేబ్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>