ఉపాధి కూలీలకు మంత్రి సీతక్క కీలక హామీ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీ కొత్తపేట తాండాలో ఉపాధి హామీ కూలీల పనులను మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క (Seethakka) పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకం కూలీలకు గొప్ప చట్టమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హాయాంలోనే చట్టం

వలసలను అరికట్టేందుకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు ఫోటో క్యాప్చర్ చేయడం సర్వర్ పనిచేయక ఆలస్యమవుతుందని తెలిపారు. ఎండాకాలం ఉపాధి కూలీలు ఉదయమే పనులు చేయాలని వారి కోసం టెంట్, మంచినీరు వసతులు కల్పించాలని ఆదేశించారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలు ఉపాధిహామీ కూలీలకు మట్టి తవ్వేటప్పుడు ముందు రోజే ట్రాక్టర్లతో నీరు తడిపితే నేల నాని త్వరగా తవ్వడానికి వీలవుతుందని సూచించారు.

మహిళా సంఘాలకు 60 వేల కోట్ల రుణాలు

మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లక్ష రుణం అందజేస్తామని, ఒకవేళ మహిళా సంఘం సభ్యులు చనిపోతే  రూ.10 లక్షల రూపాయలు జీవిత బీమా అందుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు 60వేల కోట్ల రూపాయలు రుణాలుగా అందజేశామని చెప్పుకొచ్చారు. 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్,  సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మల్కాపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద మంజూరైన మంజూల సాయిగౌడ్ గృహప్రవేశానికి మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ గౌడ్‌ హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>