కలం, వెబ్డెస్క్: ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నిరసనకారులకు కేంద్రం షాకిచ్చింది. ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర పౌరులపై ఎలాంటి లీగల్ యాక్షన్ ఉండదని ప్రకటిస్తూనే కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిలో ఎవరైనా నేర చరిత్ర ఉన్న వారు ఉంటే మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ నిరసనలకు సంబంధించి 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
నిరసనల్లో పాల్గొన్న వారిలో 2873 మందిపై సీరియస్ కేసులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న వారిలో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోవద్దని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా మళ్లీ రోడ్లపైకి వస్తామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

