కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు (Telangana Pensions) మంజూరు చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు. అర్హులను గుర్తించి ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని.. ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని అన్నారు.

