Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలోని ఇస్రోజివాడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrashekhar Reddy) బుధ‌వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇంటి య‌జ‌మానుల‌కు వంట సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారని చెప్పారు. సొంత స్థలం లేని వారికి ఇళ్ల నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, నిమ్మ విజయకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, క్రేడా అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, సలీం, పిడుగు సాయిబాబా, చింతల రవీందర్ గౌడ్, గౌరీ నవీన్ కుమార్, నర్సొల్ల మహేష్, సుదర్శన్, కోటేశ్వర్ రాజశేఖర్, బండారి శ్రీకాంత్, గంగారం, మెహర్ బాబా, రాహుల్ , వార్డ్ మెంబర్, ప్రణీత్, అజిస్, శంకర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>