నల్లగొండలో ఈనెల 16 వరకు 144 సెక్షన్ అమలు

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఈనెల 16 వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈసీ జారీ చేసిన ఎన్నికల నియమావళిని జిల్లాలో కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్లేసుల్లో ముగ్గురికి మించి వ్యక్తులు గుమికూడరాదని స్పష్టం చేశారు. అనధికార సమావేశాలు, శిబిరాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగా గుంపులు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>