కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ హైమావతి(Hymavathi) కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) తీవ్ర ఆరోపణలు చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో తన పేరు లేకుండా చేసి అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లు ఆహ్వాన పత్రికలో తన పేరు ముద్రించి పంపారని, కానీ సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ మాత్రం తన పేరును ముద్రించలేదని ఆయన ఆరోపించారు. క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్న తనకు అంబేద్కర్ జయంతి రోజున అవమానం జరిగిందని పేర్కొన్నారు. దళిత బిడ్డ ఎదుగుతున్నాడని కాంగ్రెస్ పార్టీ తనపై కుట్రలు చేస్తోందని, 78 ఏళ్ల తర్వాత కూడా దళితులపై వివక్ష కొనసాగుతోందని బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా చర్చ మొదలైంది.

