కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చతికిలబడింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో చెన్నై తన రెండో విజయాన్ని నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై(Chennai Super Kings) 192 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమన్వయంతో ఇన్నింగ్స్ దూసుకుపోయింది. రుతురాజ్ గైక్వాడ్ త్వరగా అవుటైనా, ఆయుష్ మహత్రే కేవలం 17 బంతుల్లో 38 పరుగులతో దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ 48 పరుగులతో స్థిరమైన ఇన్నింగ్స్ ఆడగా, డెవాల్డ్ బ్రెవిస్ 41 పరుగులతో స్కోరును బలపరిచాడు.
లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఆరంభం నుంచే తడబడింది. అజింక్య రహానే (28), సునీల్ నరైన్ (24) ప్రయత్నించినా చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతను 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. చివర్లో రమణ్‌దీప్ సింగ్ (35), రోవ్‌మన్ పొవెల్ (31 నాటౌట్) పోరాడినా కేకేఆర్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 160 పరుగులకే పరిమితం చేశారు.

