విజ‌య‌వాడ టెర్ర‌ర్ లింక్స్‌.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ (Vijayawada) టెర్ర‌ర్ లింక్స్‌ కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్న హైద‌రాబాద్‌కు చెందిన‌ సైదా బేగం (Sayeeda Begum)ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సైదా బేగం విచార‌ణ‌లో ప‌లు అంశాలు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. మ‌హిళ‌ల‌ను ఉగ్ర‌వాదం వైపు ఆక‌ర్షించేలా సైదా బేగం కీల‌క పాత్ర పోషించిన‌ట్లు స‌మాచారం. యువ‌త‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షించాల‌ని జీహాదీ గ్రూప్స్ ఆదేశించేవ‌ని సైదా బేగం పోలీసుల‌కు వెల్ల‌డించింది. గ్రూప్స్‌లో మ‌హిళ‌ల‌ను నియ‌మించుకోవాల‌ని ఆదేశిస్తూ టార్గెట్లు విధించేవార‌ని తెలిపింది. మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు ఆయుధాల వినియోగంలో శిక్ష‌ణ ఇవ్వాల్సిందిగా చెప్పేవార‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలో సైదాబేగం ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 42 మంది మ‌హిళ‌ల్ని రిక్రూట్ చేసుకున్న‌ట్లు విచార‌ణ‌లో తెలిపింది. వీరంతా ఖ‌వాటీన్ (KHAWATEEN) పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. లాడెన్‌, జ‌కీర్ నాయ‌క్ వీడియోల‌ను సైదాబేగం వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్ చేసింది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో 40 అకౌంట్ల‌తో జీహాదీ వీడియోల‌ను వైర‌ల్ చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. మ‌ద‌ర్సాల్లో మ‌త‌ప‌ర‌మైన శిక్ష‌ణ‌తో పాటు ఆయుధాల శిక్ష‌ణ‌కు స‌న్నాహాలు చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే సైదా బేగం వాట్సాప్, ఇన్‌స్టాలో భారీగా పీడీఎఫ్ ఫైల్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఫైళ్ల‌లో ఏమున్నాయ‌న్న‌ది తెలియాల్సి ఉంది.

Read Also: విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>