గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్, కారు సీజ్!

​కలం, ఖమ్మం బ్యూరో: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సత్తుపల్లి (Sathupalli) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి వెల్లడించారు. ​ఒడిశా కారులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్ సత్తుపల్లి పోలీస్ సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.

​విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన కామేష్ మారి, కారా రాజేంద్రగా గుర్తించారు. నిందితుల నుంచి 6.36 కేజీల గంజాయితో పాటు, కారు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీహరి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>