కలం, కరీంనగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ (డిస్ట్రిక్ట్ 320G),ఆదర్శ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ముకురంపురలోని ఆదర్శ హాస్పిటల్లో ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వ్యాధుల ముందస్తు గుర్తింపు లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మోర బద్రేశం ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి డా. అరుణ్ కటారి ఛైర్మన్గా వ్యవహరించారు.
శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా షుగర్ టెస్ట్, ECG మరియు 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డా. గోవింద్ ఝాదవ్ మాట్లాడుతూ, సరియైన జీవనశైలి మరియు క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షల ద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చని సూచించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు డిస్ట్రిక్ట్ గవర్నర్ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ మైడం శివకాంత్ పటేల్, సభ్యులు బట్టు వినోద్, మెతుకు కృష్ణ చైతన్య, ముక్క శరత్ కృష్ణ, ఐతా సూరజ్, సింగమరాజు, సనా వేణు, గుడిసె రాజేంద్ర ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

