తెలంగాణ పోలీస్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ పోలీస్ (Telangana Police) ఉద్యోగార్థుల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యూనిఫామ్ ఉద్యోగాల‌కు వ‌యో ప‌రిమితిని మ‌రో రెండేళ్లు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లో ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి మరో రెండేళ్లు పెరుగ‌నుంది. ఇప్ప‌టికే మే 18, 2026 నాడు విడుద‌లైన జీవో ప్ర‌కారం ఐదేళ్ల వ‌యో ప‌రిమితి అమలులో ఉంది. ఇప్పుడు పెంచిన రెండేళ్ల‌తో మొత్తం ఏడేళ్ల వ‌ర‌కు వ‌యోప‌రిమితి ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుంది. రానున్న‌ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఈ వ‌యోప‌రిమితి వ‌ర్తించ‌నుంది.

నిరుద్యోగ యువత నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాబోయే ప్రత్యక్ష నియామకాల్లో మరింత మంది అభ్యర్థులు అర్హత పొందేలా ఈ సడలింపు ఉపయోగపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>